కోరికలే గుఱ్ఱాలైతే: కె. . సృజన సింధూర్
కోరికలే గుర్రాలైతే
నేల విడిచి సాము చేస్తే
ఉన్న దాంతో తృప్తి పడకపోతే
ఆశ లు ఆకాశంలో ఎగిరితే

కష్టపడి చదవకుండా
క్లాసు ఫస్ట్ రావాలంటే
కోడిగుడ్లు అమ్ముకుంటూ
కోట్లు కూడ బెట్టాలంటే

బంట్రోతు ఉద్యోగం చేస్తూ
బంగాళా లో బతకాలంటే
కంప్యూటర్ నేర్వకుందా
కంపెనీలు స్థాపించాలనటే

ట్రాఫిక్ లో చిక్కుకొ కుండా
టార్గెట్ రీచ్ అవ్వాలంటే
మనిషికి రెక్కలు మొలవల్సిందే
మనిషి గాలిలొ తేలాల్సిందే.

కామెంట్‌లు