అమ్మో ...దెయ్యం ..!!:- ------శ్యామ్ కుమార్. నిజామాబాద్.


 నా బాల్యమంతా టెన్త్ క్లాస్ వరకు భువనగిరి లోనే గడిచింది .భువనగిరి తాలూకా కానీ ,అది ఒక చిన్న పల్లెటూరు కిందే లెక్క అప్పట్లో.ఇది 1975లో జరిగిన విషయం ,అప్పుడు మా చిన్నతనంలో మేము ఆరుగురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం. అందులో వాళ్ళ పేర్లు -నన్ని ముని అక్క ,సుధాకర్ శర్మ ,కర్ణాకర్, వినోద్ విజయ్ . రాత్రి పగలు తేడా లేకుండా ఆడుకునేవాళ్లం .ఎండా సమయం లేదు ,సాయంత్రం సమయం లేదు ,ఎండ వేడి తెలియదు .ఏ సమయం తగ్గట్టుగా  ,ఆ ఆటలు ఆడుకునేవాళ్లం. ఆ రోజుల్లో.      ఇండ్ల  మధ్యలో చాలా స్థలం ఉండేది. అలా ఎందుకు వదిలేవారో తెలియదు. ఆ ఇండ్ల మధ్యలో ఉన్న స్థలం,  మా  ఆట లకు  నెలవు అన్న మాట. ప్రతి రోజూ ఆటలలో తగాదా లువుండేవి. స్నేహితుల తల్లిదండ్రులు అందరిని, అత్తయ్య  -మామయ్య, అనే పిలిచే వాళ్ళ  ము.    అయితే,అప్పుడు మేమంతా పెద్ద వారిని అత్తయ్య -మామయ్య, అని పిలిచేవాళ్ళం .ఈ అంకుల్- ఆంటీ లాంటి కృత్రిమమైన పిలుపులు ఉండేవికావు. ఈ మధ్యన ఆ వూరు వెళ్లి ,సందులలోసంతోషంగా, తిరుగాడు తూ గడిపా. చాల వరకూ స్నేహితులు పట్నం వెళ్లి సెటిల్ ఆయిపోయా రు.  వున్న కొద్ది మంది రిలాక్స్ గా సంతోషంగా వున్నారు అక్కడే!అక్కడే   వుండి      పోయిన వారు ఆర్థికంగా మామూలు స్థితి లో వున్నప్పటికీ, చాలా సుఖంగా వున్నట్టుగా- అనిపించింది. నేను వున్నప్పటి ఇల్లు కూలిపోయింది. ఇంటి ఎదురుగా వున్న అత్తయ్య ఇల్లు ,పాడుపడి పోయింది. ఆ అత్తయ్య ఒక రాత్రి నన్ను 

పిలిచి ,శాము  -మా అమ్మాయి సరళ  ,చీకటి అంటేభయపడుతూ ఉంది ,కాబట్టి నువ్వు కాస్త తోడుగా వెళ్ల గలవా, ఆ దుకాణం వరకు, అని అడిగింది, సరే అన్నాను.  ఆ చీకట్లో సరళ వెంట నేను సగం దూరం వరకు మామూలుగానే,వెళ్లాను. చీకట్లో తర్వాత ఉన్నట్టుండి "అమ్మో దయ్యం..." అంటూ వెనక్కు      పరుగెత్తి వచ్చేసాను. ఆ అమ్మాయి కూడా బిగ్గరగా కేకలు వేస్తూ భయపడిపోయి , నా వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చేసింది .కాస్త దూరం వెళ్లి అక్కడ ఆగిపోయి, సంతోషం గా చూస్తూ నిలబడి పోయా.

ఆ అమ్మాయి ఏమో చెమటలు పట్టేసి భయపడిపోయి, యేడుపు  మొదలుపెట్టింది. సరదాగా,నేను ఆమెను ఏడిపిన్చడానికి,అలా చేసినట్టు,పాపం ఆమెకు తెలీదు.నేను పకపకా నవ్వుతూ కడుపుబ్బ నవ్వు తూ,మళ్లీ అమ్మాయిని,నెమ్మదిగా సముదాయించి మళ్లీ,దుకాణం  వరకూతీసుకువెళ్ళా. ఇటువంటి సంఘటనలు లేకుండా ఎవరికీ బాల్యం గడవదేమో! ప్రస్తుతం , అందరూ ఎప్పుడైనా కలిసినపుడు వీటి గురిన్చి  మాట్లాడుకుంటాం .అందరూ అంటున్టారు చిన్నప్పుడు ,శ్యామ్ తెగ కోతి వేషాలు  వేసేవాడు అని!..ఆ...రోజులు అలాన్టివి మరి...!!