గణగణ గంటల ఎద్దుల బండి
చేలో కెళ్లి వస్తుందండి
చెర్నా కోలా ఝుళిపించి
రైతు బండిని తోలునo డీ!
పెద్దగా చక్రాలుంటాయి
వాటికి ఆకులుఉంటాయి
మధ్యన ఉన్నది ఒక ఇరుసు
కందెన తోటి కదులుతాయి!
ముందు భాగం కాడిఅందురు
కాడికి వెనక రైతు ఉండును
తలపాగ చుట్టి దర్జాగా
ప్రేమతో ఎద్దుల హేయ్ అందురు!
రామ లక్ష్మణులు కోడెలు
వెనక అమర్చిన వెదురు జల్లలో
కూర్చుంటారు మహిళలుపిల్లలు!
పంటను ఇంటికి తరలించు
పట్నం వెళ్ళగా సాధనము
రైతుకు దోస్తు ఎద్దులబండి
సంక్రాంతి పండక్కి పోటీలండీ!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి