ఏమిటీ వేషం శివా?:- సత్యవాణి కుంటముక్కుల
 ఏమి రూపమురా శివా
నీది అదేమి వేషమురా
ఏమి రూపమురా శివా
నీదిదేమి వేషమురా శివా

దువ్వకేనాడు జుట్టును
జులపాలుగా మారేనుగదరా
కట్టవేనాడుబట్టను
కరిది చర్మంబు తప్పనీవు ॥॥

శిరమునా గంగమ్మ ఏమిటి
చంద్రవంక ఒకప్రక్కగామిటి
నుదుటనా మండు కన్నేమిటి
ఒడలనాబూదిపూతేమిటి  ॥॥

అర్థభాగం గౌరమ్మ ఎందుకు
మెడను ఆపాముదండేమిటి
సంసారివై చేతనా కమండలంబేమిటి 
పెదవిపైఆ హాసమిటి॥॥

అసలు కథేమొనెరిగించవయ్యా 
శివయ్యా అందు మర్మం తెలుపుమయ్యా
మా అజ్ఞానం తొలగించి శివయ్యా
మము సుజ్ఞాన మార్గమున నడుపుమయ్యా శివయ్యా
 ॥॥॥॥

            

కామెంట్‌లు