ప్రయోజకుడు: -కుంటముక్కల సత్యవాణి-కాకినాడ.

 " ఎవరినడిగి ఈ పని చేశావ్ ?
ఏం? నీకు ఇంట్లో అన్నం పెట్టమన్నామా ?
నువ్వు సంపాదించి పోస్తేనేగానీ ఇల్లుగడవదనా?" తండ్రి ఆప్యాయతతో కూడిన నిలతీత,
"అన్నీ నీ సొంత నిర్ణయాలేనా? తల్లి
తండ్రీ చచ్చేరనుకున్నావా? నీకేదైనా అయితే నీమీదే ప్రాణాలు పెట్టుకు బ్రతుతున్న మా గతేంటీ ?" ఆవేశంగా, ఆక్రోశంగా దీనంగా అడుగుతున్న తల్లి.
వెంటనే, వారిద్దరి మెడచుట్టూ ఆప్యాయంగా చేతులేసి,
"అమ్మా ! నాన్నా ! నిన్ననేకదా మనం  స్వంతంత్య్రదినోత్సవ సంబరాలు జరుపుకొన్నాం! సభలూ సమావేశాలూ తిలకించి, స్వాతంత్ర్యం గురించీ, స్వాతంత్ర్యంకోసం త్యాగాలు చేసిన నాయకుల గురించీ, దేశరక్షణకు పాటుపడే వీర సైనికుల గురించీ పొగుడుతూ మాట్లాడుకొన్నాం.
మన స్వరాజ్యం సురాజ్యంగా వుండాలని ఎందరో తల్లులు తమబిడ్డలను వివిధ హోదాలలో భరతమాత సేవకు నియోగిస్తున్నారు. వారందరిలో నేనొకడిని. అందరి తల్లుల కడుపు తీపి ఒకటే కదా? అందరూ మీలాగే ఆలోచించి బిడ్డలను సైన్యంలోకి పంపక పోతే "దేశం
పరిస్థితి ఏమిటి? దేశ రక్షణ ఎలా?
అవసరమనుకున్నప్పుడు నువ్వు మీ అమ్మను ఆదుకోవా? అలాగే ఇప్పుడు భరతమాతకు నావంటి యువసైనికుల  అవసరం ఎంతైనావుంది. భయం మాని జయం కలగాలని నన్ను ఆశీర్వదించి పంపండి మీరు" అన్న కొడుకు మాటలకు ఒక కంట కన్నీరు, మరో కంట పన్నీరు అన్నట్లు, ఒక ప్రక్క విచారంతోను, మరొక ప్రక్క తమ బిడ్డను దేశ సేవకు వినియోగిస్తున్నామన్న విజయగర్వంతోనూ,
ప్రాణప్రధమైన తమ బిడ్డకు వీడ్కోలు యిస్తూ,
"వీడ్కోలు ఏదైనా వేదనా భరితమే కానీ,ఇది మరింత ఉద్విఘ్న భరితమైన వీడ్కోలు" అనుకున్నారా  దంపతులు  ముద్దుబిడ్డకు వీడ్కోలిస్తూ,నిజమైన పుత్రోత్సాహం అనుభవిస్తూ.