అతివలందరికీ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు : మన్నెం శారద

 సకలచరాచర  సృష్టినంతా నీలో ఇముడ్చుకుని 
మనిషి చేస్తున్న దురాగతాల్ని  సహిస్తూ ,భరిస్తూ 
మోయగల మహాశక్తి స్వరూపిణి  ధరణివి  నీవు !
నిన్నే తలనిడుకుని ఈ జీవన సంగ్రామం లో 
అడుగడుగునా  పోరాడి  గెలుస్తూ 
అలుపెరుగక  ముందుకి సాగుతున్న 
నేటి మహిళని నేను !