పలుకులు:-ప్రతాప్ కౌటిళ్యా
నేను ప్రజా ప్రతినిధిని
ఇష్టం లేకుంటే
నాకు ఓటు వేయకు!?

కానీ
నీవు డాక్టర్ వైతే
నాకు వైద్యం చేయాలి!?

నువ్వు లాయర్ వైతే
నాకు 
న్యాయం చేయాలి!?

ఉపాధ్యాయుడు అయితే
నాకు 
విద్యను నేర్పాలి!?

అంతేగాని
నీకు ఇష్టం లేకుంటే
నాకు ఓటు వేయకు కు!?

రాళ్ల పర్వతాలు భూమిపై
నీళ్ల పర్వతాలు మేఘాలు
ఆకాశంలో ఎగురుతున్నాయి!?
పరువు కన్నా
బరువు ముఖ్యమని 
సర్ది చెబుతున్నాయి!?

రాళ్ల పర్వతాల కళ్ళల్లో నీళ్లు
ఎగుర లేమని!!
ఆకాశ పర్వతాల కళ్ళల్లో కన్నీళ్లు
కరుగుతున్న మని!?

ఎగిరే పక్షుల రెక్కలు 
నరికింది ఎవరో!?
అవే ఈ పర్వతాలు ప్రకృతి జ్ఞాపకాలు!?

ఆశ మనిషిని
వశీకరణం చేస్తుంది!?

మరణం
మనిషిని ప్రేమిస్తుంది!?

శృంగారం
మనిషిని గారడీ చేస్తుంది!?

స్నేహం
మనిషిని బ్రతికిస్తుంది!?

ప్రేమ
మనిషిని పాలిస్తుంది!?

Pratapkoutilya
8309529273
04/03/2021