ప్రపంచ సుఖమే అహింస
అందరిని ప్రేమించడం అహింస
శాంతి సంతరించడం అహింస
దయాగుణమే అహింస
మనసావాచా కర్మణా
ఎవరిని బాధించకుమా
హింస మానుటే అహింస
ప్రేమను పెంచి పంచును అహింస
అహంస గలిగిన మోదము
పెంచు జాతీయ చైతన్యము
కలిగించు సంస్కారము
పెంచును ఆదరాభిమానములను
నడవడికను మార్చు అహింస
ఓరిమి ఉపకారము అహింస
సామాజిక న్యాయమ అహింస
విశ్వప్రేమ పౌర ధర్మమహింస
నిమిత్తము సమత్వము అహింస
సర్వ మత సమ్మతము అహింస
పెంచును సుఖ సంతోషము
సమగ్ర సఖ్యతయే అహింస
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి