పడుచందం ... పల్లె సొంతం .:--- లీలా కృష్ణ.-తెనాలి.
చిలక ముట్టిన పండంటే , ఎంతెంతో ఇష్టం నాకు.
నా చెలి చుట్టిన చిలక తింటే, ఎరుపెక్కను తమలపాకు.

నా చెలి చూపులంటి ...సిందులాడే సందమామ రూపు.
కొలనులో స్నానమాడే నా చెలినంటింది.. కలువ రేకు.

గట్టున సాగే నా చెలిని చూసి.. పచ్చని పైర్లు తలలూపు.
చెలి పట్టెల సవ్వడి సోకనిదే.. వెలుగు చూడనన్నది సూరీడు కంటి చూపు.

నా అమ్మిని వర్ణింపగ ఆ బ్రహ్మ కూడా  చాలడులే.
తన చెలిమిని పొందిన ప్రకృతి జోరునకు.. హద్దులేకపోయెలే.

తన నోట మాట వినకుంటే ..శూన్యం తెగ  తల్లడిల్లునులే.
తన చేత ముగ్గు ముట్టకుండా .. భూమాతకు ముద్ద ముట్టదులే.

ముద్దులొలికే తన లేత పిలుపు  వినకుంటే .. ఆ లేగదూడ చిందేయదులే.