లిల్లీ పూలు... ఔషధ గుణాలు.:-పి . కమలాకర్ రావు

  లిల్లీ పూల లో  కమ్మని సువాసనతో పాటుగా  కొన్ని ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. దీని సువాసన  వాతావరణంలో  సుగంధాన్ని వెదజల్లుతుంది. మనసుకు ఎంతో హాయినిస్తుంది. ఇవి తెల్లని రంగులో ఉండి  కొద్ది వంకరగా ఉంటాయి. జ్వరం వచ్చి  మానసికంగా  కుంగుబాటు ( deppression ) కలిగినప్పుడు మానసిక ఆందోళన  ఎక్కువైనప్పుడు , కొన్ని లిల్లీ పూలను  శుభ్రంగా కడిగి నీటిలో వేసి  బాగా మరిగించి  తాటి కలకండ లేక బెల్లం వేసి  చల్లారిన తర్వాత త్రాగితే  మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. బీపీ ఎక్కువగా ఉన్నవారికి కూడా  తగ్గుముఖం పడుతుంది.
 చుండ్రు తగ్గడానికి  మరియు జుట్టు పెరగడానికి కూడా దీన్ని వాడవచ్చు.
 కొన్ని లిల్లీ పూలను  బాగా నలగ్గొట్టి   కొబ్బరి నూనె లో వేసి  బాగా మరిగించి చల్లారిన తర్వాత  తలకు రాసుకుని  ఒక గంట తర్వాత  స్నానం చేస్తే తలలోని చుండ్రు  తగ్గిపోతుంది. ఇది జుట్టు బాగా పెరగడానికి కూడా సహాయపడుతుంది.
 లిల్లీ పూల లో  యాంటీ ఫంగల్  లక్షణాలున్నాయి. ఈ పూలను నలగ్గొట్టి  పసుపు కలిపి కొబ్బరినూనెలో  మరిగించి  వడకట్టి దాచి పెట్టుకోవాలి. చర్మంపై దురదలు వస్తే ఈ తైలం రాసుకుంటే దురదలు  తగ్గిపోతాయి.
కామెంట్‌లు