చలన చిత్రరంగంలో ఎనలేని కళాసేవలందించి మన తెలుగు కీర్తిశిఖరాలు గా నిలిచిన వారిలో ఒకరైన తిక్కవరపు వెంకట రమణారెడ్డిగారు నెల్లూరు జగదేవిపేటలో 1921అక్టోబర్ 1 వతేదిన తిక్కవరపు సుబ్బిరామరెడ్డ కోటమ్మ దంపతులకు మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. వీరి అన్నగారి కుమారుడే ప్రముఖ పారిశ్రామికవేత్త కళాబంధు టి.సుబ్బిరామ రెడ్డిగారు. నాటకరంగంపై వ్యామోహం పెంచుకున్నారు రమణారెడ్డి. వీరిచెల్లెలు భర్త విజయవాడలో శానిటరి ఇనిస్పెక్టర్ చదివించారు. గుంటూరులో 'టీకాలు'వేసే ఇన్ స్పెక్టర్ గా ఉద్యోగం చేసేవారు. తనమేనకోడలు సుదర్శనమ్మను వివాహంచేసుకున్నారు. 1951లో తన దగ్గర బంధువు నెల్లూరిలో ప్రముఖ న్యాయవాది అల్లాడిశంకరరెడ్డి (లవకుశ నిర్మాత)పిలుపు మేరకు మద్రాసు వచ్చి వైవిరావు(నటిలక్ష్మి తండ్రి) దర్శకత్వంలో సర్వోదయ వారి'మానవతి'(1951) జానపద చిత్రంలో జంగమదేవర వేషంలో'తళుక్ తళుక్ మని మెరిసే'అంటూ పాటపాడారు. మెదటి చిత్రంలో విలన్ గానటించారు.ఆచిత్రంలో కథానాయకుడు చదలవాడనారాయణరావు. జూ"శ్రీరంజని కథానాయకి. అనంతరం దీక్ష'(1951) 'పల్లెటూరు'(1952)గరికపాటి రాజారావు గారు నిర్మించిన పుట్టిల్లు'(1953)(ఈచిత్రం ద్వారా జమున పరిచయం అయ్యారు) 'కన్నతల్లి'(1953)(ఈచిత్రద్వారా గాయని సుశీల పరిచయం అయ్యారు) ''పార్వతి కల్యాణం'(1958)లో నారదుని పాత్ర ధరించారు. సారథీస్టూడియోస్ వారి 'రోజులుమారాయి' (1955)చిత్రంలో కరణం పాత్రమంచి పేరు వచ్చింది.అలా 'ఇల్లరికం' (1959) 'ఆత్మబలం'(1964) 'అంతస్తులు'(1965) వంటి వందల చిత్రాలలోనటించారు.రేలంగి రమణారెడ్డి మామా అల్లుళ్ళుగా పలుచిత్రాలలో నటించారు. 'రాముడు భీముడు'(1964)'నాదీఆడజన్మే'() వంటి పలుచిత్రాలు వచ్చాయి.చిత్తూరు నాగయ్యగారి ఉన్న ఇంటిని కొని చివరివరకు అక్కడే ఉన్నారు.
ఈయన మెజిషియన్ గా మంచి పేరు పొందారు. రచయిత ఆరుద్రగారు మెజిషియన్ పనికి చాలా సహాకారం అందించేవారు.ఆయనకు సహయకుడు గా పొట్టిసత్యం.మోహన లు ఉండేవారు.ఈమోహన తమిళ నటుడు ఆర్టు డైరెక్టర్ టి.ఎస్.బాలయ్య గారి కోడలు అయింది.శిర్వాణివారి 'అక్కాచెల్లెలు.'()చిత్రలో హిందీనటి నర్తకి 'హెలెన్'తో నటించారు.1968 అల్స్ ర్ కు శస్త్రచికిత్స చేయించుకుని ఆరోగ్యం సహకరించక నిడివి తక్కువ పాత్రలలో నటిస్తుండేవారు. వీరికి ముగ్గురు కుమార్తెలు,ఇద్దరు కుమారులు ఉన్నారు.1974నవంబర్ 11 న చివరిశ్వాసవదిలారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి