స్త్రీ శక్తి:-ధనాశి ఉషారాణి-చిత్తూరు జిల్లా-భాకరాపేట

 నిద్రలేచింది మొదలు
ఉరుకులు పరుగులుతో
బ్రతుకు దారిలో సాగుతూ
నడుము వాల్చుటకు కాసింత టైం దొరకపోయినా
శ్రమలో నిత్యము ఓదార్పు పొందుతూ
కుటుంబం ముందుకు నడుపుటకు చెమట చిందించుతూ
తనవారి కోసము నిత్యము త్యాగము చేస్తూ
పిల్లల భవిష్యత్తు కోసము నిత్యము పరితపిస్తూ
ఆకలి దప్పికలు మరిచి
నిత్యము ప్రగతి దారిలో నిలిచి
బంగారు బతుకును ఇచ్చుటకు
అణునిత్యము కలలు కంటూనే
బంగారు భవితను దిద్దే
స్త్రీ శక్తికి సాటిలేరు ఇలలోన
ఆధిపత్య సమాజములో
నిత్యము ఆణిగిమణిగి ఉంటూనే
ప్రతిభను చాటే  స్త్రీకి సాటిలేరు ఇలలో
జోహార్ లుఅందుకో స్త్రీ శక్తి