బాలలూ మీకు తెలుసా -ఈరోజు వరల్డ్ స్లీపింగ్ డే...:--మొహమ్మద్. అఫ్సర వలీషా -ద్వారపూడి (తూ గో జి )

 నిద్ర శరీరానికి విశ్రాంతి స్థితి నిస్తుంది 
నిద్ర మనుషులలోనే కాదు
జంతువులు,పక్షులు,సరీసృపాలు
ఉభయచరాలు,చేపలలో కూడా కనిపిస్తుంది 
దైనందికంగా బ్రతకటం కోసం 
నిద్ర అందరికీ చాలా అవసరమైనది
ప్రాధమిక అవసరమైనది
శారీరకపరంగా ముఖ్యమైనది 
నిద్ర ఆరోగ్య జీవనానికి సుఖపరమైనది
నిద్ర, నిశ్శబ్దం,విశ్రాంతి ఉంటేనే
మానవ మనుగడ ఎలాంటి 
ఒత్తిడి లేకుండా సుఖమయంగా సాగుతుంది 
బాలలూ హాయిగా పడుకోండి
బద్దకం వీడండి 
ఎర్లీటు బెడ్
ఎర్లీ టు రైజ్....

కామెంట్‌లు