ఎగతాళివ్యంగ్యం
వెటకారం
కలగలిపి
దంతవైద్య
విద్యార్థిని
అపహాస్యం
చేసిన రోజులు
ఇంకా గుర్తున్నాయ్ !
పన్ను పీకడానికి
పన్ను కట్టడానికి
నాలుగు సంవత్సరాల
డిగ్రీ కొర్సా ...!! అని,
చచ్చు వ్యాఖ్యానాలు
చేసిన వాళ్ళూ ..
గుర్తున్నారు !
దంత వైద్య ...
విద్యార్ధీ _విద్యార్థినులు ,
కలసి మెలసి
ఆనందంగా
గడుపుతుంటే ... ,
కుళ్లుకుని ...
గోళ్ళుకొరుక్కున్న
వైద్య విద్యార్థులు
గుర్తున్నారు !
ప్రభుత్వ ఆసుపత్రుల్లో
ఉద్యోగం సంపాదించి ,
ప్రజాసేవ చేద్దామనుకున్నప్పుడు ,
అసలు ఏమాత్రమూ
సహకరించకుండా ,
ఇబ్బందులు
పాల్జేసిన
వైద్య మితృల
కుచ్చితపు బుద్దులు,
ఎలా మరిచిపోగలం,!
ఐయినా అన్నింటికీ
సంయమనం పాటించి,
వొదిగి రోజులు
గడుపుకున్న రోజులు
మరుతామన్నా
మరవలేని రోజులవి !
ఇప్పుడు కాలం మారింది ,
సమాజంలో
దంతవైద్యుడి ,
హొదా ..
అసూయ పడేలా,
అత్యున్నత శిఖరాలకు
చేరుకుంది .
అన్ని రంగాలలో
అత్యున్నత స్థానాల్లో
ఈనాడు
దంత వైద్యుడున్నాడు.!
దంత వైద్యులుగా ,
కవులుగా ..రచయితలుగా ,
క్రీడాకారులుగా ,
నటులుగా _చిత్రకారులుగా ,
అడ్మినిస్ట్రేటర్లు గా ,
ఒకటేమిటి ?,
భిన్న రంగాలలో ,
తమ ప్రతిభను
చూపిస్తున్నారు !
డబ్బుకూడా
దండిగానే
సంపాదిస్తున్నారు !
సంపాదన మత్రమే
తమ ద్యేయం కాకుండా ,
స్వచ్చంద సేవలు
చేస్తున్నవాళ్లూ ఉన్నారు .
వాళ్లందరికీ వందనం !
దంత వైద్య రంగానికి
విశేష సేవలందిస్తున్న
మహానుభావులందరికి
వేలకు వేల వందనాలు !!
విష్ యు హాపీ
డెంటిస్ట్ డే ._
x
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి