వయసు ---మనసు...!!:-డా.కె.ఎల్.వి.ప్రసాద్ -హన్మకొండ.
వయసు మళ్లిన 
శరీరం లోనుంచి,
యవ్వనం కోల్పోని 
మనస్సు ....
అంతర్గతంగా ,
అల్లుకుపోయివున్న 
కోర్కెల తేనెపట్టును ,
కెలికి ,
అప్పుడప్పుడు ,
ఉలిక్కి పడేట్టు చేస్తుంది !

ఉహించని 
ఈ హృదయ స్పందనలకు ,
ఎక్కడిదో ఒక కొత్త మనసు 
ఆకర్షణల అలలలో ,
కొట్టుకు వచ్చి ,
ఉత్ప్రేరకమయి 
ఉక్కిరిబిక్కిరి చేస్తుంది .!

అంతేకాదు ....
వయసును 
మరిచిపోయి,
ప్రేమను పంచే 
హృదయ కవాటాలు 
తెరవమంటుంది !

నిద్రాణమైవున్న 
యవ్వన ప్రేరకాలను ,
తన అల్లరి ఉత్తేజాలతో ,
తట్టి లేపుతుంది !

అమాయకం గానో,
అదుపుతప్పిన 
మనసుతోనో ,
ఆ ..రెండు 
హృదయాల మద్య ,
వికసించిన 'ప్రేమ '
స్వేచ్చా విహంగమై ,
హద్దులు దాటి ,
బ్రతుకు ....
సుద్దులు చెప్పేవరకు ,
వీర విహారం చేస్తుంది !!
      ********