చీమలు -(బాల గేయం )-- ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
చిన్ని చీమలు సైతము 
చేయును శ్రమ నిరతము 
భూమిలోను పుట్టకట్టి 
దాచుకొను ఆహారము!

తనకంటే పదిరెట్లు 
బరువును మోయునెట్లు? 
ఓర్పు నేర్పు తెలియును 
గరిమనాభి తానగును !

ఐకమత్యపు జీవనం 
శ్రమను పంచు విధానం 
క్రమశిక్షణ క్యూ పద్ధతి 
మానవుడు నేర్చుకోవాలిది!

హడావుడిగా పోతున్నా 
జాతిని చూసి ఆగునన్నా 
పలకరింపులూ పరామర్శతో 
మర్యాదస్తుడు చీమన్నా !

నీటినుండి కాపాడినట్టి 
పావురం మేలు మరువకను 
వేటగాడి బాణం గురిని 
తప్పించేను పాదంకుట్టి !