అక్షరమాలికలు:-డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.

 ఏకపది:(గజం)
*******
1.వినాయకుని అంశతో.....స్నేహపూరితమైన జంతువు!
2.అడవుల్లో నివసిస్తూ.... తన తొండంతో,కొమ్ములతో ఆకట్టుకుంటుంది.
ద్విపదం:(ఐరావతం)
********
1.ధవళవర్ణంతో మెరిసిపోతుంటుంది.
స్వర్గాన ప్రత్యేకమై నిలిచింది.
2.క్షీరసాగరమధనంలో పుట్టింది.
దేవతల పక్షమై దివ్యంగా విరాజిల్లింది.
త్రిపదం:(యువత)
*******
1.ఉక్కునరాలు,ఉడుకునెత్తురు కలవారు.
అధికమైన తేజస్సుతో కనబడువారు.
భవిత తామై నిర్ణయాత్మకమవుతారు.
2.ఆవేశం,ఆలోచన కలగలిసిన వారు.
ఎంతటి పనినైనా సాధించే దీక్ష కలవారు.
తలుచుకుంటే గొప్ప లక్ష్యాన్ని అవలీలగా సాధించేవారు.
చతుష్పదం:(గ్రంథాలయం)
**********
1.పుస్తకాలన్నీ ఒకే చోట లభించు నిలువరం.
విజ్ఞానాన్ని నిరంతరం అందించే
భాంఢాగారం.
నోరులేని మిత్రుడై నిరంతర సహాయం చేసే దేవాలయం.
విజ్ఞానాన్ని పంచే అవిశ్రాంత ఆవాసం.
2.నిరుద్యోగులకు కల్పవృక్షమవుతుంది.
పాఠకులకు వరమై నిలుస్తుంది.
సమస్త ప్రజలకు అందుబాటులో ఉంటుంది.
ప్రపంచ జ్ఞానాన్నంతా తనలో ఇముడ్చుకుంటుంది.