దిన పత్రిక -బాల గేయం :-- ఎం. వి. ఉమాదేవి
దిన పత్రిక చదువుదాం 
దివ్యంగా ఎదుగుదాం 
ప్రపంచంలో వార్తలపై 
పట్టును సాధించుదాo !

ఆటలకూ ఒక పేజీ 
కవితలు చాలా ఈజీ 
పిల్లలు గీసే బొమ్మలు 
చక్కని బాలల కథలు !

చదువుకి ప్రభుత్వ సాయం 
ఆట,పాటల పోటీలు 
ఆరోగ్యం విషయాలెన్నో 
ప్రముఖులు బాగా వ్రాస్తారు!

చరవాణిలో చెత్త చూడకు 
చదువుకున్నది మర్చిపోకు 
పత్రికలెంతో జ్ఞానం ఇస్తాయ్ 
ప్రతిభను వెలికి తీస్తాయి !