విషాద మహానీయం (స్మృతి గాథ ) * సమీక్ష *: రమాదేవి బాలబోయిన-కవయిత్రి /రచయిత్రి --హన్మకొండ . ఆ అమ్మయాదిలో రాసిన.... *విషాదమహనీయం* ....పుస్తకం చదివాను....అందులో ఉన్నవి అక్షరాలు కావు ఆత్మీయతకలబోసిన *మధురస్మృతులు*,సోదరసోదరీమణుల మధ్య ఉండే ఆప్యాయత,వారి రాక కోసం ఎదురుచూపులు,వారిని వారి మాటలని ఎదనిండా నింపుకుని తనువంతాకొత్తశక్తిని నింపుకోవడం పుస్తకం చదువుతున్నంత సేపు మరో ప్రపంచానికి తీసుకెళ్ళాయి...నా తదనంతరం నా సోదరులు కూడా ఇలాగే ఆలోచిస్తారేమో అనే భావన కలిగీంది...తల్లిదండ్రులు అనాలోచితంగా ప్రవర్తించిన దానికి ఆవిడ అవివాహితగానే మిగిలిపోయి *కుటుంబానికి వెలుగివ్వడం కోసం జీవితాన్ని త్యాగం చేయడం ఆమెను పేరుకు తగ్గట్టుగానే మహనీయురాలిగా నిలబెట్టింది..*..

  భాధ్యత గల ఉపాధ్యాయవృత్తిని చివరిదాకా కొనసాగించి ...తను పెంచిన మీ అభివృద్ధిని కళ్ళారా చూసి తనెవరికీ భారం కాకూడదనీ,రుణగ్రస్తురాలిని కాకూడదని భావించిన ఆవిడ ఆత్మాభిమానం కొట్టొచ్చినట్లు కనబడుతోంది....   

     అమ్మ తరువాత అమ్మగా మారిన తాను చివరిక్షణాలలో మీ ఇంటికి వచ్చి ప్రాణాలు వదలడం మీ పట్ల తనకున్న అనంతప్రేమను ,మరదలు కూడా ఆడపడుచుకై ఎదురుచూసేంత ఉన్నత గుణంకల వారిగా ఆవిడ ఎవరెస్టంత ఉన్నతంగా కనపడ్డారు...

   మీకువారి రాసిన ఉత్తరాన్ని కూడా మీరు పుస్తకంలో పొందుపరచడంతో ఆవిడ సౌమ్యతను రంగరించుకున్న అక్షరాలు మనసులోకి చొచ్చుకుపోతున్న ప్రేమబాణాల్లాఉన్నాయి

   ఆధ్యంతం ఆసక్తిగా చదివిన నాకు ఒక్కటే అర్ధమైంది.....మనిషి ఉన్నప్పుడే ప్రేమను పంచడమొక్కటే కాదు ....మనవారు పంచాలనుకున్న ప్రేమను కూడా పొందితే వారూ మనశ్శాంతిగా ఉంటారు....ఇవ్వడమొక్కటే కాదు..తీసుకోవడం కూడాతెలియాలి అని అనిపించింది.....

ఎందుకంటే మన రక్తం మనలాగే ప్రేమపిపాసులు కదా......

   అమ్మ..మహనీయమ్మకు నీరాజనాలు అర్పిస్తూ......