చేతివాటం-ఎడమచేతివాటం(నానీలు):-డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.
1.అలవాటుగా జరిగే
   క్రియ
   అసంకల్పితంగా చేసే
   అలవాటు.
2.ప్రత్యేకమైన
   అలవాటు
   బలమైన గుర్తింపు
   ఎడమచేతివాటం.
3.వామహస్తమే
   శక్తివంతమైనది
   ఆయుర్దాయం
   నిండా సంపూర్ణం.
4.ప్రముఖులైన 
   వారు కొందరు
   చేతివాటంతో
   ప్రసిద్ధికెక్కారు.
5.అనేక కళల్లో
    చేతివాటం
    సవ్యసాచిత్వంతో
    బహిర్గతం.
6.సమూహంలో 
   ప్రత్యేకంగా నిలిచి
   అలవాటుతో
   ఆకర్షణీయమవుతారు.
7.గురిచూసి
   చేసారంటే
   బరిలోన తప్పక
   నిలవాల్సిందే.