తెలివైన పనివాడు.:-డా.బెల్లంకొండ నాగేశ్వరరావు


 అమరావతి నగరంలో రామయ్య అనే రైతు ఉండేవాడు.అతనికి పండ్లతోటలు,వ్యవసాయ భూములు,సంవృధ్ధిగా పశువులు ఉండేవి. అతని వద్ద చాలా మంది పని వాళ్లు ఉన్నా,తన పనులన్ని చూడగలిగిన నమ్మకమై వ్యక్తి కోసం ప్రయత్నిస్తూ,సాటి రైతులవద్ద ఈవిషయం చెప్పాడు.ఆరైతులు పంపగా, ముగ్గురు యువకులువచ్చారు.వారిని రోజుకు ఒకరి వంతున రమ్మని చెప్పి,మొదటిరోజున వచ్చినయువకుడిని 'నాయనా పొరుగున ఉన్న 'తాడేపల్లి'గ్రామంలో చొక్కరాతి రంగయ్య గారి వద్ద నేను కొన్ని ఆవులు కొన్నాను.ఇవిగో డబ్బులు బస్ లోవెళ్లి వారి ఇంట్లో ఉన్న ఒక ఆవును తొలుకురా,మార్గంలో భోజనంచేయి 'అన్నాడు రామయ్య.డబ్బుల అందుకున్నఆయువకుడు బయలుదేరివెళ్లి ,తిరిగి ఆవుతో రాత్రికి అమరావతి చేరాడు.'ఏంనాయనా ఇంత ఆలస్యం అయిందేం?'అన్నాడు రామయ్య.'అయ్య ఈ ఆవు నాకు కొత్త,నేను ఆఊరి మార్గానికి కొత్త,ఆవు దారి పొడవునా నన్ను చాలా ఇబ్బంది పెట్టింది'అన్నాడు.'సరే ఇవిగో ఈరోజు పనిచేసిన డబ్బులు, నేను కబురు పెట్టినపుడు పనికి వద్దువుగాని వెళ్లిరా!'అనిసాగనంపాడు.మరుదినం వచ్చిన యువకుడిని కూడా మోదటి రోజు యువకునికి చెప్పినట్లే చెప్పి,డబ్బు ఇచ్చి పంపించాడు.ఆయువకుడు తాడేపల్లినుండి ఆవును తోలుకుని అమరావతికి  రాత్రికి వచ్చాడు.ఆవు శరీరంపై విపరీతమైన దెబ్బల వలన ఏర్పడిన వాతలు కనిపించాయి రామయ్యకు.'నాయనా ఆవును ఇంతగా ఎందుకు కొట్టావు?'అన్నాడు రామయ్య.'కొట్టక పోతేమాట వినే రకంకాదు ఈఆవు ఎంత ఏడిపించిందో దారిపొడవునా ,మీకేంతెలుసు' అన్నాడు ఆయువకుడు.'సరే ఇదిగో ఈరోజు పనిచేసిన డబ్బులు,నేను నీకు కబురుపెడతాను అప్పుడు వచ్చి పనిలో చేరుదువుగాని వెళ్లిరా!,అని ఆయువకుని సాగనంపాడు రామయ్య.మూడవరొజు వచ్చిన యువకుడికి రామయ్య డబ్బులు అందిస్తూ,గతంలో ఆఇద్దరి యువకులకు చెప్పినట్లే చెప్పి,నీపేరేమిటి నాయనా అన్నాడు.'అయ్య నాపేరు శివయ్య, ఈవేసవి ఎండలో ప్రయాణమంటే ఆవు ఇబ్బంది పడుతుంది.నేను రాత్రికి తాడేపల్లి చేరి, వేకువనే బయలుదేరి ఎండ ముదరక ముందే మన ఊరు చేరుకుంటాను'అన్నాడు మూడవరోజు యువకుడు.అతనిమాటలు నచ్చిన రామయ్య 'నీయిష్టం అలాగే వెళ్లిరా'అన్నడు.మరదినం ఉదయం తెల్లవారిన కొద్ది సేపటికే శివయ్య ఆవును తొలుకు వచ్చిపశువుల పాకలో కట్టివేస్తు'తలపై ఉన్న పచ్చిగడ్డి మూట ఆవు ముందువేసి, అక్కడి పనివారితో' నాలుగు బానల వేడినీళ్లతో ఆవును రుద్దితూ పోయండి అప్పుడు కాని దానికి ప్రయాణ బడలిక పోదు' అన్నాడు.

ఇదంతా గమనిస్తున్నరామయ్య'ఆవుకు వేడినీళ్లస్నానమా? అయినా నువ్వు ఇంత ఉదయాన్నే ఎలారాగలిగావు'అన్నాడు.'అయ్యా ఆవు కూడా ప్రాణం ఉంటుంది దాని శరీరం ఇన్ని మైళ్లు నడచి అలసి పోయి ఉంటుంది.వేడినీళ్లుతో కడిగితే చాలావరకు శరీర నొప్పులు తగ్గుతాయి. ఇంత ఉదయాన్నే ఎలా రాగలిగాను అంటే,నిన్న సాయంత్రమే, పచ్చిగడ్డికోసి మోపుకట్టి పెట్టుకున్నాను.తొలికోడికూతకే మన ఊరు  బయలుదేరి,కొద్ది కొద్దిగా ఆవుకు తలపై ఉన్న పచ్చగడ్డి అందించసాగాను, నేను అందించిన పచ్చగడ్డి పరకలు తింటూ నావేనుక రాసాగింది,నేను వేగంగా నడవడంతో ఆవు వేగంగానన్నుఅనుసరించింది'అన్నాడు.శివయ్య తెలివైన పనివాడే,పశువులు  కూడా ప్రాణులే అన్న శివయ్యలాంటి పనివాడే తనకు కావలసింది అనుకున్న రామయ్య' వెళ్లు కాలకృత్యాలు తీర్చుకో,మన ఇంట్లోకి వెళ్లు,అమ్మభోజనం పెడుతుంది తిని,మీఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకొ ఈరోజుకు,రేపటినుండి పనిలొనిరా!ఇదిగోనీ పిల్లలకు ఏదైనా తీసుకువెళ్లు, అని డబ్బులు అందించాడు రామయ్య.

వినయంగా తలఊపాడు శివయ్య.


కామెంట్‌లు