పిల్ల చేష్టలు.. అవి అంతే ..!!:- ------శ్యామ్ కుమార్.నిజామాబాద్.

  నేను పుట్టి పెరిగిన ఊరు భువనగిరి.  నానమ్మ తాత బాబాయిలు. .వాళ్ల పిల్లల  మధ్య బాల్యం స్వర్గం లా  ప్రతి రోజూ గడిచింది.  తోటి వారు అందరూ స్నేహితు లే. రోజూ పోట్లాట లే. కానీ    శత్రువులు లేరు.  పోట్లాడు కున్న  తర్వాత మళ్లీ వాడితో మరుసటి రోజు స్నేహం చేస్తే కానీ మనసు కు  ఏమీ తోచదు.  ప్రతీ విషయం లో నవ్వు వచ్చే ది.  ప్రతీ ఆట ముగిసే వరకు ఆనంద మే.  వెన్నెలలో నాలుగు రాళ్లు ఆట ' కబడ్డీ ఆటలు.     పెద్దలు ఇంక చాలు తిని పడుకో అంటే వెంటనే దిగులు.  మేము యేడుగురు స్నేహితులతో, తప్పు అని తెలిసికూడా ఒక సారి  బీడి తాగాలని ప్రణాళిక వేశా ము. 
 అప్పుడు 6 వ తరగతి చదువుతున్న ట్లు  గుర్తు.  అవి కొంటా నికి   10 పైసా లు  తీసుకొని దూరంగా వున్న ఒక శెట్టి కొట్టు కు వెళ్లా ము.  మళ్లీ అక్కడ భయం భయంగా కొన్నా ము. దానికి పెద్ద రిహార్సల్. ఎలా అడగడం, మొహం ఎలా పెట్టాలి.  కొట్టు వాడికి అనుమానాలు వస్తే ఎలా.  వాడు మన పెద్దలకు చెప్పుతాడ? . మరింక ఇప్పుడు మాకు ఒక పెద్ద అసలు సమస్య ఏమిటంటే, కొన్నారు సరే మరి ఎక్కడ కాల్చడము.  ఎవరూ చూడని విధంగా.  మొత్తానికి మాకు ఆ అడ్డా దొరికింది.  అది తురకల శ్మశానం!!.  గుండెలు అర చేతిలో పెట్టుకుని, దయ్యాలు ఆత్మలు కనపడతాయేమోనని చూసు కుంటూ, ఒక గోడ పక్కన కూర్చొని తలా ఒకటి వెలిగిం చి  పీల్చి చూస్తే,  ఒక్కటే దగ్గు, కళ్ళల్లో నీళ్ళు.  దిమ్మ తిరిగి ఇప్పుడు లాభం లేదు మళ్లీ ట్రై చేద్దామని వాటిని గోడ చీలిక లో దాచి పెట్టి బతుకు జీవు డా  అని పారిపోయాo. బీడి సిగరెట్ మీద ఆ రకంగా మోజు తీరింది.  మళ్లీ ఆలోచిస్తే ఒట్టు. మళ్లీ శ్మశానం వెళ్లే సాహసం చేయలేదు.  అప్పుడప్పుడు అక్కడ వదిలి వేసిన బీడి లు  అగ్గి పెట్టి గుర్తు చేసుకునే వాళ్లo. గడిచిన బాల్యం తిరిగి రాని కల.  ఆ సమయంలో తెలీదు అది ఎంత తీయని దో అని.   గడిచిన బాల్యం కఠిన మైన దైనా, మధురమైనదైనా,ఎంత వేడు కున్న  తిరిగి రాదు,జ్ఞాపకాలు మాత్రం మిగిలిపోతాయ్!!