కూరగాయలు -బాల గేయం :-- ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
రాజ కూర వంకాయలు 
గుత్తి మసాలా,పచ్చడి !
గోబీ కుర్మా,పకోడీలు 
ఆలూ  చిప్స్ ఆఁహాఁ సందడి!

చిక్కుళ్ళు వలిచిపెట్టు 
ఉల్లి పాయ పొట్టు తీయి!
టమాటాలు తరిగి పెట్టు 
చింతపండు నానబెట్టవోయి!

ఆకుకూరలో పురుగులు 
దాగుంటాయ్ కడగాలి 
ఉప్పు నీటిలో కూరలు 
కొద్ది సేపు ఉంచాలి !

నిమ్మకాయ పులిహోరనూ 
సి, విటమిన్ దక్కునురా !
కొత్తిమీరా, పుదీనాలునూ 
మునగాకు మంచివిరా !

బటాణీలు వొలిస్తేనయా 
హుషారెన్తో కలుగుతుంది 
బెండకాయ, దొండకాయా 
వేపుడెo తో బాగుంటుంది!

సంపూర్ణ ఆహారం తో 
సమకూరే ఆరోగ్యము  
అమ్మకు వంట సాయంతో 
మనసులోన ఆనందము!


కామెంట్‌లు