అమ్మ-అమృతం:-సత్యవాణి

 అమృతమా అదెలా వుంటుంది?
అమ్మ పాలలా వుంటుందా?
అమృతమా అదెలా వుంటుంది?
అమ్మ ముద్దులా వుంటుందా?
అమృతమా అదెలా వుంటుంది?
అమ్మ లాలనలా వుంటుందా?
అమృతమా అదెలా వుంటుంది?
అమ్మ పొత్తిలిలా వుంటుందా?
అమృతమా అదెలా వుంటుంది?
అమ్మ జోలలా వుంటుందా?
అమృతమా అదెలా వుంటుంది?
అమ్మ పాలనలా వుంటుందా?
అమృతమా అదెలా వుంటుంది?
అమ్మ చేతిగోరు? ముద్దలావుంటుందా?
అమృతమా అదెలా వుంటుంది?
అమ్మ ఆప్యాయతలా వుంటుందా?
అమృతమా అదెలా వుంటుంది?
అమ్మ అనురాగంలా వుంటుందా?
అమృతమా అదెలా వుంటుంది?
అమ్మ చెప్పు సుద్దునిబోలుంటుందా?
అమృతమా అదెలా వుంటుంది?
మా అమ్మ ఆనందాశృవులని పోలి ఉంటుందా?
అమ్మకంటే ఘనమైనది
అసలెక్కడవుంటుంది
అమ్మేకద అవనిలోన
అమృతసమానమైనది
            
కామెంట్‌లు