నీవే అంతా--*ఓం నమశ్శివాయ*

 కొబ్బరి  చెట్టు  ఎక్కేవాడు  చెట్టుకు 
నమస్కారించి  ఎక్కుతాడు •••
అంటే  ,  ఎక్కే  శక్తి  తమకు  లేక. కాదు  ,
పైకి  పోయినవాడు  కాలు  జారి క్రిందపడే 
అవకాశాన్ని  కొట్టి  పారేయలేక. •••
అంతేకాదు , చెట్టు నెక్కే  శక్తి  తనకు  ఉన్నా   ,
ఆ. శక్తి  వాస్తవానికి  పరమాత్మదే   అనే
సత్యం   గుర్తించడం   వలన. ••••
డ్రైవరు  స్టీరింగు  పట్టుకునే  ముందు  రెండు
చేతులు  జోడిస్తాడు  ••••
నదికి  నమస్కారించి  ఈతగాడు  నదిలో
దూకుతాడు  ••••
బావిలో  పడిన. పాత్రను  తీయడానికి  
బావిలో  దిగేవాడు  ముందుగా   బావికి  
నమస్కరిస్తాడు  ••••
వంట. చేసే  ముందు   తల్లులు   పొయ్యికి
నమస్కరిస్తారు  ••••
తనకు  నైపుణ్యమున్నా  ప్రమాదాన్ని  
డ్రైవరు  మనసు  నుండి  తీసివేయలేదు  ,
తనకు  ఈత. తెలిసిన, సుడు లుంటాయనే 
సత్యాన్ని  ఈతగాడు  విస్మరించలేదు  ,
పాత్ర. కొరకే   బావిలో  దిగుతున్న, పాము  -
లుంటాయేమో  అనే  సంశయాన్ని  
దిగేవాడు  తొలిగించుకోలేడు  ,
వంట. అనేది  మంటతో  కూడుకున్న పని  ,
చేయి  కాలుతుందేమో   గ్యాసు  లీక్  
అవుతుందేమో  --  ఏమో  !  
జీవితంలో   ఎప్పుడు   ఏది  జరుగుతుందో 
ఎవరికి  తెలుసు  ?   అందుకే  •••••
"  అర్జునా ! నీవు  నిమిత్తంగా  ఉండు  "
అన్నాడు  గీతలో   శ్రీ  కృష్ణుడు  ,
నిమిత్తమాత్రంగా  ఉండు   అంటే   ,
అహంకారం  లేకుండా  ఉండమని  అర్థం   ,
ఇది  కేవలం  అర్జనునికి చేసిన. ఉపదేశం  కాదు  ,    మనందరికీ   ఉపకరించే  సందేశము  ,
సమరంలో   అర్జునుడు  నిమిత్తమాత్రుడు  ,
సంసారంలో  అందరూ  నిమిత్తంగా  ఉండాలని
పరమాత్మ.  అభిప్రాయము  , 
సన్యాసంలో  అయితే   మరీను  ...
మనం  నమిత్తం  కాగలిగితే  సర్వానికి  పరమేశ్వరుడే  సమాయత్త మవుతాడు,
నీకు  ఎంత శక్తి  ఉన్నా, పరమాత్మ
అనుగ్రహం  లేకుండా  నిన్ను  నీవు 
రక్షించుకోలేవు,  
అశక్తులైనవారు  కూడా  పరమాత్మ కృపను  పొంది  శోభిస్తూ ఉండటం  చూస్తూనే  ఉన్నాం  •••••
మనం  భక్తులమైతే  మన వద్ద భక్తే  ఉంటుంది ,   నిమిత్తమాత్రులం  కాగలిగితే
మనకార్యాలలో  ఆ పరమేశ్వరుని  పాదముద్రలే
కదుల్తూ  ఉంటాయి  ....... ఓం నమో వేంకటేశాయ.
Nagarajakumar.mvss