ఆది ..అంతం అంతా నీవే.:--లీలా కృష్ణ.తెనాలి.
పలికే పలుకునకు లేదులే రూపం.
నిను చూపే అద్దం.. ఎరుగదు శబ్దం.

కనలేని , వినలేని  ఎద .. తూగదు తూకం.
నీ  ఎద నిర్ధారణకు నీవే ఆధారం.
ఎదకలుసయ్యావో తప్పదు భారం.

ఏదీ లేదంటే  అవుతుంది అది శూన్యం.
శూన్యంనుండే మొదలవ్వును సర్వం.

తనను తాను తీర్చిదిద్దుకున్నాడు దైవం.
ఆ దైవాన్ని ప్రతిబింబించుటయె నీ కర్తవ్యం.

ఇలలోని వ్యవహారాలే కలలకు మూలాధారం.
మూలాలను మరచిననాడు నువ్వు బ్రతికేం లాభం.

కవి యొక్క ఆలోచనలకు ప్రతిరూపమే.. కవిత్వం.
చిత్రాలు లేకున్నా.. చిత్రవిచిత్రాలు చూపును కవితలోని భావుకత్వం.


కామెంట్‌లు