సరదా సరదాగా!!:-- యామిజాల జగదీశ్
 1. 
ఎంతటి గొప్ప విద్యావంతుడైనా సరే
ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి అందరికీ వినిపించేలా చదవగలరా?
2. 
స్కూల్ టెస్టులో బిట్ కొట్టొచ్చు
కాలేజీ టెస్టులో బిట్ కొట్టొచ్చు
కానీ
బ్లడ్ టెస్టులో బిట్ కొట్టలేముగా?
3. 
కుక్కకెంత విశ్వాసమైనా ఉండొచ్చు
కానీ 
అది థాంక్యూ అని చెప్పలేదుగా
4. 
వెయ్యి ఉండొచ్చు
కానీ
వెయ్యిన్నొక్కట్టే పెద్దది
5. 
ఎంతటి అహింసావాదైనాసరే
ఒత్తిన చపాతీని కాలిస్తేనే తినగలడు
6. 
మనమెంతటి వీరులైనా కావచ్చు
కానీ 
ఎముకలు కొరికే చలిని 
నువ్వు కొరకలేముగా
7. 
డబ్బుంటే కాల్ ట్యాక్సీ
డబ్బు లేకుంటే కాళ్ళే ట్యాక్సీ
8. 
పంటి నొప్పయితే 
పంటిని పీకి పారేయొచ్చు
కానీ
కంటి నొప్పంటే
కంటిని పీకలేముగా
9. 
ప్యాంట్ వేసుకుని 
మోకాళ్ళపై కూర్చోగలం
కానీ 
మోకాళ్ళపై కూర్చొని 
ప్యాంట్ వేసుకోలేం
10. 
బస్సులో కలెక్టరెక్కినా
దేశాధినేత ఎక్కినా
మొదటి సీటు డ్రైవరుకేసుమీ
11. 
సైకిల్ కెరియర్లో 
టిఫిన్ కెరియర్ ఉంచగలం 
కానీ 
టిఫిన్ కెరియర్లో
సైకిల్ కెరియర్ ఉంచలేముగా
12. 
టిక్కెట్ కొనుక్కుని లోపలికెళ్తే 
అది సినిమా థియేటర్ 
కానీ 
లోపలికెళ్ళి టిక్కెట్ కొంటే 
అది ఆపరేషన్ థియేటర్
13. 
ఎంత ఈత కొట్టడం తెలిసినా 
చేప పులుసులోమాత్రం 
ఈత కొట్టలేదుగా
14. 
మన దగ్గర ఎంతటి ఖరీదైన సెల్ ఫోనైనా ఉండొచ్చు 
ఎంత డబ్బుకైనా 
రీచార్జ్ చేయించుకోవచ్చు 
మన నెంబరుకి 
మనం కాల్ చేసుకోలేముగా
15. 
క్రీం బిస్కెట్లో క్రీం ఉంటుంది 
కానీ 
కుక్క బిస్కెట్లో కుక్క ఉంటుందా

16. 
ఒక చీమ తలచుకుంటే 
వెయ్యి ఏనుగులను కుట్టగలదు 
కానీ 
వెయ్యి ఏనుగులు ఒక్కటైనాసరే 
ఒక్క చీమనైనా కుట్టలేవు

17. 
సెల్ ఫోన్లో బ్యాలన్స్ లేకుంటే 
కాల్ చేయలేం 
కానీ 
మనిషికి కాలు లేకుంటే 
బ్యాలన్స్ చేయలేడు
18. 
రైల్వే స్టేషన్లో 
పోలీస్ స్టేషన్ ఉండొచ్చు
కానీ 
పోలీస్ స్టేషన్లో 
రైల్వే స్టేషన్ ఉండదుగా

19. 
ఎంతలా ఎగిరినా 
దోమని 
పక్షుల జాబితాలో చేర్చలేముగా
20. 
అరటికాయ చిప్స్ ని తినగలం 
కానీ 
మెమరీ చిప్స్ ని తినగలమా?