తూర్పు సూర్యుడు(బాల గేయం)--ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
తూర్పున సూర్యుడు తెల్లన
పొద్దటి ఎండ చల్లగా
పగటి ఎండా వేడిగా
పడమటి సూర్యుడెర్రగా

బానుడు గూటిలో చేరాడు
తారల నడుమ దాగాడు
చల్లని చంద్రుడు వచ్చాడు
వెన్నెల వెలుగులు పంచాడు

చుక్కలన్ని చూసాయి
పక పకమని నవ్వాయి
పిల్లలందరు వచ్చారు
చందమామను చూసారు

ముగ్గురు చేతులుకలిపారు
ముద్దుగా టెక్క వేశారు
నల్లగా వేస్తే దొంగలు
తెల్లగా వేస్తే దొరలు

వెన్నెల వెలుగుల్లోకొచ్చారు
నీడలు తొక్కుతూ ఆడారు
తొక్కిన నీడను పట్టారు
దొరకకుండా ఉరికారు