ఏకపది:(అమ్మ)
*******
1.నవమాసాలు మోసి_పురిటినొప్పులు భరించిన సహనమూర్తి మాత.
2.సృష్టికి ప్రతిసృష్టి చేసే శక్తితో_జన్మనిచ్చే తల్లి.
ద్విపదం:(అమ్మభాష)
********
1.అమ్మ నుంచి సంక్రమించే మాతృభాష.
పుట్టుకతో వెంటనంటి వచ్చు భాష.
2.భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరచగలిగేది.
సహజంగా నోటి నుండి వెలువడేది.
త్రిపదం:(పరభాష)
*******
1.మనది కాని మరో తెలియనిభాష.
భావవ్యక్తీకరణ చేయలేని పరాయిభాష.
లిపి,సంప్రదాయాలు అభ్యాసంలో లేనిది.
2.ఇతర ప్రాంతాల నుండి వచ్చేది.
సహజంగా ఉండక,అసౌకర్యం కల్గించేది.
భాషణ,లేఖనాల్లో కఠినమై ఉండునది.
చతుర్థపదం: (తీయని తెలుగు)
***********
1.మనసులోని భావాలను స్వేచ్ఛగా వెలిబుచ్చేది.
భావవ్యక్తీకరణకు బలంగా తోడ్పడేది.
శ్రవణ,భాషణ,లేఖనాలకు అనువైనది.
సంతోషంలోనూ,బాధలోనూ సహజంగా వచ్చేది.
2.పద్య,గద్య మయమై అలరిస్తుంది.
కమ్మని ప్రయోగాలతో పరవశింపజేస్తుంది.
అనేక ప్రక్రియలతో అలరారుతుంది.
అస్తిత్వమై మనకు దారి చూపిస్తుంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి