చందమామలో మచ్చ:-ఎడ్ల లక్ష్మి- సిద్ధిపేట
వచ్చాడమ్మా వచ్చాడు
బాల భీము డొచ్చాడు
ఆట లాడ చూసాడు
బాలు తిప్పి విసిరాడు

నేలమ్మను తాకుతూ
ఆకాశానా ఎగిరింది
అందకుండా పోయింది
చందమామను చేరింది

నట్ట నడుమ నిలిచింది
నల్లని మచ్చగా మారింది
భీముడు వేసిన బాలును
చందమామలో చూడండి

అందురు కలిసి రారాండి
బంతి ఆటలు ఆడండి
బలంగా మీరు ఉండిండి
చంద్ర మండలం చేరండి