అదెలా మరువను : -ఎన్న వెళ్లి రాజమౌళి, కథల తాతయ్య..

 ఆనాటి మరుపు ... ఈనాటికీ మరువలే...  అవి నేను ఆరవ తరగతి చదువుతున్న రోజులు. మా అమ్మగారు ఊరు కొండాపూర్ లో ఉండి, తిమ్మాపూర్ లోని ప్రాథమికోన్నత పాఠశాలలో చదివేవాడిని.  తిమ్మాపూర్ కొండాపూర్ పాఠశాలకు కేంద్ర పాఠశాల గా ఉండేది.      ఒకరోజు కొండాపూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిమ్మాపూర్ లో లీవ్ లెటర్ ఇమ్మని ఇచ్చాడు.   జేబులో పెట్టుకొని పాఠశాల కు వెళ్లాను. పాఠశాల చుట్టి అయ్యేవరకు కూడా లీవ్ లెటర్ సంగతి జ్ఞాపకమే లేదు.  మిత్రులతో కలిసి మళ్లీ కొండాపూర్ వచ్చాను.    కొండాపూర్ పెద్దసారును చూసేసరికి లీవ్ లెటర్ జ్ఞాపకం వచ్చింది... అయ్యో సార్ మీ లీవ్ లెటర్ ఇవ్వలేదని... మళ్లీ తిమ్మాపూర్ కు పరుగు పెట్టాను.    నేను వెళ్లేసరికి పాఠశాలకు తాళాలు వేయిస్తున్న పెద్ద సార్ నా వద్ద లీవ్ లెటర్ తీసుకున్నాడు..  అదే పరుగుతో కొండాపూర్ వచ్చి సార్ కు లీవ్ లెటర్ ఇచ్చిన సంగతి చెప్పగా-బేస్ అని నా భుజం తట్టాడు....
కామెంట్‌లు