వరసిద్ధి వినాయక!:-డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.

 తొలిపూజలందుకొనే దైవం
విఘ్నాలను తొలగించే వరం
మోదకహస్తుడై మోదం కలిగించి
మూషికవాహనుడై మూలాన్ని తెలిపి
లంబోదరుడై లక్ష్యశుద్ధి ఏర్పరుస్తాడు.
గజాననుడై గహనమైన ఆత్మజ్ఞానాన్ని అందిస్తాడు.
గణేశుడై గుణగణాలను శుద్ధమొనరిస్తాడు.
మహోదరుడై మహోపకారం చేస్తాడు.
వినాయకుడై విద్యలనొసగుతాడు.
విఘ్నేశ్వరుడై విజయాలనందిస్తాడు.
పార్వతీతనయుడై పరిపూర్ణతనొసగుతాడు.
లక్ష్మీగణపతై సంలదలనిచ్చి
చింతామణిగణపతై చింతలు తొలగిస్తాడు.
వినాయకచవితి నాడు దివి నుండి భువికేతెంచి
నవరాత్రుల పూజలనందుకొని
లోకాన్ని క్షేమంగా ఉంచుతాడు.

కామెంట్‌లు