ఉషస్సులా వచ్చింది
ఉదయకిరణం
ఆమె పాలబుగ్గలపైపడి
చటుక్కునమెరిసింది
బుట్టబొమ్మలా
పూలరెమ్మలా
వచ్చిందామె నాషాపుకు
కాళ్ళుపైకెత్తి
కళ్ళువిప్పార్చుకొని
చూసింది సీసాలలోని
రంగుల ముచ్చిరేకుల్లో
చుట్టబడివున్న చాక్ లెట్స్ వైపు
"అంకుల్ " "అంకుల్ "
సీసాలోని చాక్ లెట్ చూపించింది
నాచేతిలోని చాక్ లెట్ అందుకోడానికి
మడమలు పైకెత్తింది
చిన్ని చిన్ని కాళ్ళు
చిట్టి చిట్టి చేతులు
ఆమె చెట్టి చెేతుల స్పర్శ
నా చిన్నతల్లిని గుర్తుచేసింది
గుండెలో మమతలవెల్లువ పొంగింది
గుండెపైతన్ని
తనప్రియతముడితో వెళ్ళిపోయిన
నాపాప కనిపించింది
ఆపాపలో
కన్నులు కన్నీళ్ళతో మసకబారాయి
చేయిలోని చాక్ లెట్స్ ని
చిన్నిపాప గుప్పిట నిండా వుంచాను
తానిచ్చిన మెరిసే రూపాయిని
తన మరోగుప్పిటలో వుంచాను
పాప కనులలో తళ తళలు
మిలమిల మెరుపులు కనుపాపలో
ఆ మెరుపు వెలుగులో
ఆమె కనుపాపలలోనేను
ఒకడినే ఇద్దరుగా
నా పాపే మరో రూపంలో
ప్రతీ ఉదయం నాముంగిట ఉషస్సే
బండబారిన నాహృదయంలోనుండి
మమతల జలధార
వద్దు వద్ధు ఈ మమతల ఊయల
మరోసారి అనాధను
కాదలుచుకోలేదు నేను
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి