మంచుదుప్పటి.:-- లీలా కృష్ణ.తెనాలి.
ఉదయభానుడి చూపుకి అందనంది మంచుదుప్పటి.

ఉభయకుశలోపరి అనే పదము వెనుక దాగి ఉన్నది... 
మంచు కన్నా చల్లనైన, మంచి ఒకటి.

బాలింత మోయు మాయలోని పిండాన్ని కమ్మిన ...
మంచుదుప్పటి మహిమకు...  లేదు పరిమితి.

పులకింత తెప్పించే కాశ్మీర లోయలోని మంచుదుప్పటి..
తీసుకొచ్చింది భారతదేశానికి ఒక అందమైన ఆకృతి.

ఎముకల్ని గడ్డకట్టించే సియాచిన్ లోయలోని గడ్డకట్టే స్థితి...
మన సైనికుల్ని నిరంతరం వెంటాడే విషమ పరిస్థితి.

మంచు దుప్పటి కప్పుకున్న హిమక్రీములు రుచి..
కంచు గుండెల్ని సైతం కరిగించే.. మధురానుభూతి.

మంచు దుప్పటిలో పురుడుపోసుకున్న వైరస్ల... ఉనికి..
తిరిగి మంచు దుప్పట్లో దాచిపెట్టిన వ్యాక్సిన్ పోటుకి ...అయ్యింది ఆహుతి.

మంచు దుప్పటిని మోసే రిఫ్రిజిరేటర్ల ఉన్నతి..
ఈ మధ్యకాలంలో  శరవేగంగా పెరిగి... 
ప్రకృతి మనుగడకు తెచ్చిపెట్టింది అధోగతి.

మంచు దుప్పటి కప్పుకున్న నీలకంఠుని 
కంఠము యొక్క నలుపు వెనుక ఉన్న ..కథ ఏమిటి..
అదేమిటో కాదు.. మంచు ప్రదేశంలో.. 
పెరుగు తోడు కట్టక, మజ్జిగ  త్రాగలేదు కాబట్టి.


కామెంట్‌లు