కుంపటి -(బాల గేయం )--ఎం. వి. ఉమాదేవి -నెల్లూరు
కుంపటి అంటే బొగ్గులపొయ్యి 
కూరలు పప్పు ఉడుకుతాయి 
సంప్రదాయపు  వంటల తీరు 
రుచిగా త్వరగా జరుగుతాయి!

పల్లి కాయలు,చిలకడ దుంపలు
కాల్చి తింటేను భలే మజా 
బొగ్గులువేసి కాగితంఉండ
కిందఅంటిస్తే తయారుగా !

విసనకర్రతో విసరాలి 
వంటల పిదప చల్లార్చాలి 
తందూరి రుచిని ఇచ్చేకుంపటి 
 పదేళ్లు క్రిందే కనుమరుగయ్యే!!


కామెంట్‌లు