బాలబాలికలారా!:- కవిత వెంకటేశ్వర్లు
ఎక్కండి ఒక్కొక్క మెట్టు
చదువుపై ఉండాలి పట్టు
చదవనని చేయకండి బెట్టు
స్నేహితుల చెంత వద్దు గుట్టు

భయాలను వదలి పెట్టు
స్నేహితులంత ఒక జట్టు
ఉన్నప్పుడే గెలుపు తట్టు
మీరంతా దేశానికి వజ్ర మట్టు

అందరితో కలిసి కట్టు
భయానికే భయం పుట్టు
తారతమ్యాలకు ఫులస్టాపెట్టు
పరీక్షల్లో రావాలి ఫస్ట్

జనగణమని మొదలెట్టు
జాతీయగీతానికి  సెల్యుట్టు
జైజవాన్ జైకిసాన్కు జైకొట్టు
జనం నిను చూసి మురిసేట్టు!!
              

కామెంట్‌లు