అక్షరమాలికలు:-డా.రామక కృష్ణమూర్తి=బోయినపల్లి,సికింద్రాబాద్.


 ఏకపది:(కళ)

*******

1.సాధనతో వశమై_ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది.

2.వైవిధ్యంతో కూడి_కళాత్మకంగా తీర్చిదిద్దబడుతుంది.


ద్విపదం:(చిత్రీకరణ)

********

1.మనసులోని భావనను చిత్రించేది.

కంటికి కనబడే దృశ్యాన్ని బంధించేది.

2.నియమితమైన వాటితో చేస్తుంది.

అందాన్ని,ఆనందాన్ని రంగరిస్తుంది.

త్రిపదం:

*******

(ఫోటోగ్రఫీ/కాంతిచిత్రసాధనం)

1.అందమైబ దృశ్యాల్ని చిత్రీకరించేది.

కాంతి చిత్ర సాధనమై కనువిందు చేస్తుంది.

సృష్టికి ప్రతిసృష్టి చేసి ఆనందాన్ని కల్గించేది.

2.మాయచేసి మనస్సును దోస్తుంది.

కంటికి ఇంపుగా పండుగ జరుపుతుంది.

దాచుకోదగ్గ ధనమై వర్థిల్లుతుంది.


చతుర్థపదం:(మానవత్వం)

***********

1.మనిషిలో ఉండవలసిన‌ గుణరాజం.

సహజంగా స్పందించే సహజాతం.

ఔదార్యంతో వికసించే పరిమళం.

మానవాళి మనుగడకు సాధనం.

2.సృష్టిలో గొప్పదై విరాజిల్లుతుంది.

కఠినశిలను సైతం కరిగిస్తుంది.

గొప్పగుణమై లోకంలో కీర్తించబడుతుంది.

సుజనుల లక్షణమై గుర్తించబడుతుంది.