చిలుక:-సత్యవాణి కుంటముక్కుల

 చిలుకమ్మ ఊగింది చిగురాకు ఊయల
చిగురులో కనిపించె చింతకాయొకటి
చిలుకమ్మ నోరూరె చింతనూ జూడ
ఎగిరింది కొమ్మకూ ఎంచక్క చిలుక
పట్టింది కాయనుా పదిలంగతాను
కొరికాంది చింతనూ కూసింత గాను
ఝల్లుమనె వొళ్ళంత జలజరించేను
పులుపుతో వొళ్ళంత పులకల్లు రేగె
నాకొద్దు ఈకాయ నాకు వద్దనుచు
తుర్రునా ఎగిరింది తొర్రకూ చిలుక
         
           
కామెంట్‌లు