చేద బావి -(బాల గేయం) :-- ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
పెరట్లో చేద బావి పిలుస్తుందిరా 
చేంతాడు బక్కెటుతో నీళ్లుచేదరా!
చల్లని ఆ మంచినీరు చలువనిచ్చురా 
తీయని గంగమ్మ ఊట మూలనుందిరా 

గాలికి రాలిన ఆకులు తోడివేయరా 
అల్లరి పిల్లలనటుగా వెళ్లనీకురా 
బట్టలు ఉతకరాదు బావి దగ్గర 
వాడుకనీరు వదలాలి మొక్కలదగ్గర!

చేతులకు వ్యాయామం చేదబావితో 
పాతకాలం ముచ్చట్లు బావిదగ్గర 
నూతిలోని కప్పలాగ ఉండకూడదు 
నీరువృధాగ పారబోయకూడదు!