సమయస్పూర్తి: - సత్యవాణి

  పండిట్ మదనమోహన మాలవ్యగారి పేరు తెలియనివారు
భారతదేశంలో వుండరంటే అతిశయోక్తిగాదు.
       బెనారస్ హిందూ విశ్వవిద్యాలయస్థాపనకు ఆయన 
అనేక ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో ఆయనకు అనేకమైన ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి.
         ఐతే విశ్వవిద్యాలయ స్థాపనలో ఆయన వెనుకడుగు వేయదలుకోలేదు.దేశంలోని అనేకమంది ధనికుల దగ్గర విరాళాలు సేకరించి విశ్వవిద్యాలయం నిర్మించాలని నిశ్చయించుకొన్నారు.
        అందులోని భాగంగానే, మాలవ్య ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన హదరాబాదును పాలించే ఏడవ నవాబు పతేజింగు మీర్ ఉస్మాన్  ఆలీఖాన్ వద్దకు వెళ్ళి .బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ స్థాపన గురించి వివరించి విరాళమివ్వవలసినదిగా కోరాడు.
      నవాబు విరాళమివ్వకపోగా "ఎంత ధైర్యం నీకు? హిందూ విశ్వవిద్యాలయం నిర్మాణమంటూ నన్నే విరాళమడుగుతావా?" అంటూ తన ఎడమకాలి చెప్పును తీసి మదన్ మోహన్ మీదకు విసిరేశాడు.
       అలా ఎవరైనా మనమీదకు చెప్పును విసిరితొ మనమైతే ఏంచేస్తాం? కోపం తేచ్చుకొంటాం.అవమానపడతాం. ఆ నవాబును ఏమీ చేయలేక తిట్టుకొంటూ రుసరుసలాడుతూ బయటకు వెళ్ళాపోతాం.
       కానీ మాలవ్య అవేమీ చేయలేదు.చిరునవ్వుతో ఆ చెప్పును తీసుకొని బజారులోకి వెళ్ళి, "ఇది నవాబుగారి చెప్పు,దీన్నినాకు విశ్వవిద్యాలయ స్థాపనకు ఆయన విరాళంగా ఇచ్చేరు.కావలసినవారు వేలంలో కొనుక్కోవచ్చు"నంటూ ప్రకటించారు.
       నవాబుగారి చెప్పు అన్న ప్రకటన విన్న ఆ నగర ప్రజలు వేలంలో పాల్గనడానికి తండోపతండాలుగా రావడం ప్రారంభించారు.
           ఇదంతా గమనించిన నవాబుగారి భటులు పరుగు పరుగున వెళ్ళి నవాబుకీ విషయం తెలిపారు.  ఆవిషయంవిన్న నవాబు ఖంగ్ తిన్నాడు.
        "నవాబునైన నా చెప్పును రూపాయికో,పావలాకో వేలంలో ఎవరైనా తలమాసినవాడు పాడుకొంటే ,నా పరువేమవ్వాలి ?"అని భయపడి,వెంటనే కొందరు భటులకు పేద్ద పేద్ద సంచీల