బొమ్మలు -బాల గేయం :--ఎం. వి. ఉమాదేవి
అరల్లోని బొమ్మలు 
అందాల బొమ్మలు 
అందరమూ ఆడుకునే 
అచ్చమైన బొమ్మలు 

జంతువులూ పక్షులు
జింకలూ శంఖులూ 
పల్లెటూరులో ఇళ్ళు 
పెద్ద పెద్ద ఏనుగులూ 

తాబేలు కుందేలు 
రామ చిలక పక్కన 
దేవతలు రాకెట్ 
మా బొమ్మల ముచ్చట్లు !

చేతివృత్తి కళాకారులకు 
చేయూతను ఇవ్వండి 
పిల్లలు సైతం బొమ్మలుచేసి 
అమ్ముతారు కొనాలండీ !