లింగమయ్య:-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 కొండపై ఉండేటి ఓ లింగమయ్యా
శతకోటి పబ్బతులు ఓ లింగమయ్యా
శతకోటి దండాలు ఓ లింగమయ్యా 
!!కొండపై!!
త్రిశూలధారివీ ఓ లింగమయ్యా
త్రినేత్రధారివీ ఓ లింగమయ్యా
ఎద్దునెక్కీ నీవు ఓ లింగమయ్యా
లోకాలు తిరుగుతావు ఓ లింగమయ్యా
పాములన్నీ నీకు ఓ లింగమయ్యా
సొమ్ములైనాయి ఓ లింగమయ్యా
!!కొండపై!!
ఏనుగుతోలూ నీకు ఓ లింగమయ్యా
అంగవస్త్రమయ్యింది ఓ లింగమయ్యా
కాష్టంల బూడిద ఓ లింగమయ్యా
నీ ఒంటికే పూసినవు ఓ లింగమయ్యా
మనిషి పుర్రెతో నీవు ఓ లింగమయ్యా
బిచ్చమెత్తుతావు ఓ లింగమయ్యా
!!కొండపై!!
నీవు బిచ్చమడిగేది ఓ లింగమయ్యా
మాభక్తియే కదా ఓ లింగమయ్యా
బదులుగా నీవిచ్చేది ఓ లింగమయ్యా
మాకు ముక్తియే కాదా ఓ లింగమయ్యా
జగతికే నీవు ఓ లింగమయ్యా
శుభములిచ్చేవాడివి ఓ లింగమయ్యా
!!కొండపై!!