ఒకసారి ఫించ్ పక్షి , డేగను డబ్బు సాయం అడిగింది. అది అప్పుగానే తీసుకుంది. ఇది జరిగి చాలా కాలం అయింది. డేగ చనిపోయింది. చనిపోయేముందు పిల్లలకి ఒక సందేశం రాసి మరీ ప్రాణం విడిచింది. అదేమంటే.. 'మీ తాతగారు ఫించ్ తాతగారి దగ్గర కొంత డబ్బు అప్పు చేశారు.' అని.
ఆయన కుటుంబం అప్పు తీసుకున్నప్పటి నుంచి, డేగ పిల్ల ఫించ్ కుటుంబీకులు తీరుస్తారనే ఇంకా ఎదురుచూస్తోంది. కానీ ఆ పిల్లలు ఎవరూ కనిపించలేదు.
ఒకరోజు బియ్యం తూకం వేస్తూన్న చెట్టుదగ్గరికి వెళ్లి డేగ కూర్చుంది. కొంత దూరంలోనే వున్న కోడి పిల్లను చూసింది.
'ఓ, కోడిపిల్లా, ఇక్కడేం చేస్తున్నావ్?' అని అడిగింది డేగ.
'ఆహారం కోసం వచ్చాను.'
'నీకు ఫించ్ ఎక్కడున్నదీ ఏమన్నా తెలుసునా? దాని కోసం వెతుకుతున్నాను. మా నాన్న ఆస్తి కొంత తీసుకుంది. తిరిగి ఇవ్వలేదు, అడగాలి. అది ఎక్కడ వుండేదీ తెలుసా?'
'అలాగే. సులభంగానే కనుక్కోవచ్చు.'
'ఎక్కడ? ఎలా?'
'ఈ గ్రామంలో వాళ్లు బియ్యం తూకేచోటకి వెళ్లి చెట్టుచాటున దాగి వుండు. అక్కడికి వస్తుంది. పట్టుకోవచ్చు.'
అది చెప్పినట్టుగానే డేగ అ ప్రాంతానికి వెళ్లి దాక్కుంది. అన్నట్టుగానే ఫించ్ అక్కడికి వచ్చింది. తిండి గింజలు ఏరుకుంటోంది. డేగ హఠాత్తుగా వచ్చి పడింది.
'అరే, నువ్వా! చాలారోజులకు కనిపించావ్. నీ కోసమే ఎదురుచూస్తున్నాను. ఇప్పటికి కనపడ్డావ్. మీవాళ్లు తీసు కున్న అప్పు ఇవాళయినా ఇస్తావా?'
'ఏమిటీ? అప్పు ఇవ్వడమేమిటీ?'
'అవును, మీరే ఇవ్వాలి.'
'ఎవరు చెప్పారు, ఇక్కడున్నానని ఎవరు చెప్పారు?'
'కోడి చెప్పింది.'
'అయ్యో, ప్నేహితుడా, మేమిద్దరం చాలాకాలం నుంచి ఇబ్బందుల్లో వున్నాం. చాలారోజులుగా కోడి కోసమే ఎదురుచూస్తున్నాను. ఎక్కడా కనిపించలేదు. నువ్వేమో ఇంతకాలం నా గురించే చూస్తున్నావు. నువ్వు కనిపించకపోవడంతో నీకు ఇవ్వాల్సింది దానికి ఇచ్చాను. అదీ కనిపించడం లేదు మిత్రమా!'
కానీ ఫించ్ చెప్పినది డేగ నమ్మలేదు.
అవును మా ఇల్లు నీకు తెలుసుగదా?'
తెలీనట్టే డేగ అయోమయంగా చూసింది.
'సరే. పద వెళదాం.'
రెండూ ఫించ్ వుండే ప్రాంతానికి వెళ్లాయి. అదో పెద్ద గోడ దగ్గర ఉంటోంది.
'ఇదుగో ఇక్కడే ఆ కోడిని మా తాతగారు పనిలోకి పెట్టుకుంది. అదుగో అక్కడ మా పిల్లలు పడుకోనున్నారే.. అక్కడే కోడి కుటుంబం ఉండేది. ఒక్క ఆకు కూడా లేదు, ఈకలే వున్నాయి.. చూస్తున్నావుగా!'
దగ్గరికి వెళ్లి డేగ పరిశీలనగా చూసింది. కోడి ఈకలు కనపించాయి. వాటిని కాళ్లతో నెట్టేస్తూన్నా అంతా అవే వున్నాయి.
'అవును ఫించ్ మిత్రమా, నువ్వు నిజం చెప్పావు. మరి మన మధ్య ఇక ఈ గొడవ దేనికి?'
'నేను నా పనివాళ్లను.. కోడి కుటుంబంలోని వారిని నీకు అప్పగిస్తాలే.'
ఈ కారణంగానే, ఇప్పటికీ కోడి పిల్లల్ని డేగలు ఎత్తుకు పోతుంటాయి.
( ఆఫ్రికా కథ)

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి