ఆరోగ్య సూత్రం ..!!: - ----డా.కె .ఎల్ .వి.ప్రసాద్ హన్మకొండ .

 మహారాష్ట్రలో 
మళ్లీ లాక్ డౌన్ !
గతాన్నిమళ్ళీ 
గుర్తు చేస్తున్న 
కరోనాకలకలం !
నాటి చైనాలో 
ఊహాన్ ను 
గుర్తు చేస్తున్న 
మహారాష్ట్ర లోని
అమరావతి ..!
వేల సంఖ్యల్లో
కరోనా బాధితులు
రెన్డువందల నలభై
రకాల వైరసుల
వికటాట్టహాసం,
దేని తీవ్రత ఎలాన్టిదో
తెలియని వైనం!
రాష్ట్రసరిహద్దులు
మూత పడి
ఇన్టి తలుపులు
మూసుకు పోయి
ఎమర్జన్సీ
బ్రతుకులు 
మొదలయ్యాయి !
వచ్చి పొయింది 
కరోనా ....
అనుకోవద్దు 
అవే జాగ్రత్తలు 
తీసుకోవడం 
ఎంతయినా 
అవసరం ....!
వేడినీళ్లు త్రాగడం 
ఆవిరి పీల్చుకోవడం ,
భౌతిక దూరం 
పాటించడం ...
మూతికి మాస్క్ -
ధరించడం ...
నిన్ను నీవు రక్షించుకోడం 
మందిని అలాగే 
రక్షించడం ......
మరువబోకు నేస్తం !
అదేమన ఆరోగ్య సూత్రం ..!!