'కోతిని వెక్కిరించాను'... : - ఎన్నవెళ్లి రాజమౌళి , కథల తాతయ్య


 మా గ్రామం స్కూల్లోనే ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత పొందాము. 9వ తరగతి లేనందున మా తరగతిలోని అందరికీ సర్టిఫికెట్లు ఇచ్చారు. మేమంతా మా గ్రామానికి దగ్గరలోని సిద్దిపేట స్కూల్ లో జైన్ అయ్యాము. ప్రతిరోజూ కాలినడకనే వెళ్ళేవాళ్ళం. ఇంచుమించు 25 మంది ఉన్నాము. మధ్యలో  ఇన్సాన్ పల్లి ఉంటుంది. ఆ ఊరిని దాటవేసి వెళ్ళాలి. మా తడకపల్లి గ్రామానికి కి సిద్దిపేట 6 కిలోమీటర్లు ఉంటుంది.

 ఇన్సాన్ పల్లి లో ఒక పెద్ద కోతి ఉండేది. అది ఎందరినో కరిచింది. ఆ కోతి భయానికి గుంపులు గుంపులుగా ఉంటేనే వెళ్లేవాళ్లు. ఒకరు వెళ్లడానికి కి సాహసించేవారు కాదు. ఒకరోజు అందరము వెళుతున్నాము. నేను చివర ఉన్నాను . కోతి కనపడేసరికి నేను కొంటెగా కి కి కి కి అంటూ వెక్కిరించి చాను. అది మా వెంట పడింది. మేము ఒకటే పరుగు. రంగారెడ్డి  అనే మా మిత్రుడు మాతో కాక, సైడ్ కు ఉరక సాగాడు. కోతి  మమ్ములను వదిలి రంగారెడ్డి వెంటపడింది. రంగారెడ్డి కింద పడగా కోతి మీద ఎక్కి కూర్చుంది. రంగారెడ్డి ఒకటే ఏడుపు. అటుగా వెళ్లే అతను అను ఎవరో.. కర్రతో బెదిరించ గా కోతి భయపడి ఉరికింది. రంగారెడ్డి మాత్రం సిద్దిపేట వచ్చే వరకు ఒకటే ఏడుపు!