రెండు కుందేళ్లు, ఒక ఎలుగు:- టి. లలితా ప్రసాద్

  ఒకరోజు రెండు కుందేళ్లు అడవిలో దూకుతూ పోతున్నాయి.
    మొదటిది ''మనం మంచి స్నేహితులం. మనం ఒకరికి ఒకరం సాయం చేసుకోవాలి. ఏదన్నా పెద్ద జంతువు నీ మీదకి వస్తే,  నేను నిలిచి నీకు సహాయం చేస్తాను'' అన్నది.
    రెండవది, ''ఏదన్నా పెద్ద జంతువు నీ మీదకి వస్తే నేనూ అలానే సహాయం చేస్తాను.'' అన్నది.
    కొంతసేపటికి రెండూ పెద్ద శబ్దం విన్నాయి. అది పెద్ద ఎలుగు. ఒక కుందేలు వెంటనే చెట్టు ఎక్కేసింది.
    రెండవది కాస్తంత లావుగా వుండడంతో చెట్టు ఎక్కలేకపోయింది. కానీ చెట్టుమీదకి ఎగిరి మొదల్లోనే చనిపోయినట్టు పడిపోయింది.
    క్షణం తర్వాత ఎలుగు  ఆ కిందపడున్న కుందేలు దగ్గరికి వెళ్లి వాసన చూసింది. ఆ చిన్న కుందేలు  ఊపిరి బిగబట్టింది.  ఎలుగు దాన్ని చచ్చిందనుకుని తన దారిన వెళిపోయింది.
    చెట్టుదగ్గర పడిన కుందేలు తన స్నేహితుడిని అడిగింది, ''ఎలుగు నా చెవిమీదకి మూతిపెట్టిందిగదా, ఏమన్నది?'' అని.
   రెండవది, ''అదేమన్నదంటే 'నీ స్నేహితుడిని అస్సలు నమ్మవద్దు. అవసరమయినపుడు వాడు నిన్ను వదిలేసి వెళిపోయేడు' అని''
                                                                                                                                                      (టిబెట్‌ జానపద కథ)