బరిగలు విరిగాయి:- ఎన్నవెళ్లి రాజమౌళి , కథల తాతయ్య


  'బరిగలు విరిగాయి'... ఆ యేడు మా తడకపల్లి చెరువు నిండి, నిండుకుండను తలపించింది. మా 9వ తరగతి మిత్రులకు పండుగే పండుగ. ప్రతిరోజు సాయంత్రం చెరువు తూము మీద కూర్చోవడం నిత్యకృత్యమైంది.  కొంతసేపు కూర్చున్న తర్వాత ఈత కొట్టే వాళ్ళం. తూము దగ్గరనుండి మత్తడి వరకు వెళ్లి ఈత కొడుతూ వెళ్లి వచ్చేవాళ్ళం.  చెరువులో దొంగాట ఆడే వాళ్ళం. ఆడి ఆడి అలసి మళ్లీ భూమి మీదకు చేరేవాళ్ళం. తూము మీద కూర్చుండి, అలలను చూస్తూ ఆనందించే వాళ్ళం.  ప్రతిరోజు పొలాలకు నీళ్లు విడిచి పొలాలను నీరటి కాడు పారించే వాడు  ఒక రోజు నీరుని. తూము ద్వారా వెళ్లే నీళ్లను చూసి, ఇంకా కొంచెం నీళ్లను తూము ద్వారా లూజు చేసి విడిచాను. నీళ్లు ఎక్కువయ్యేసరికి ఇంకాలూజు చేశాము.    అయ్యో.... నీళ్లు ఎక్కువ అయితున్న వని టైటు చేయడానికి ప్రయత్నించాం. ఎంత ప్రయత్నించినా టైటు చేయరాక పోవడంతో అక్కడనుండి జారుకున్నాం.   చెరువు వెనుక ఎక్కడ చూసినా నీళ్ళే.... ఈ సంగతి నీరటికాడు సర్పంచ్ కు చెప్పాడు.    మరునాడు సర్పంచ్ అయిదారుగురి తో వచ్చి, ప్రధానోపాధ్యాయులు కి చెప్పాడు.   ఈ సంగతి క్లాస్ టీచర్ తో చెప్పగా-ఆరోజు మా చేతుల్లో కొన్ని బరిగలు నాట్యం చేయగా-ఇంకా కొన్ని బరిగలు విరిగాయి


కామెంట్‌లు