పరిసరాలలో చదువులు(బాల గేయం)-ఎడ్ల లక్ష్మి, సిద్ధిపేట
చిన్నారి పాపాయి వచ్చింది 
అమ్మను ఆవును చూసింది
అ ఆలు రాసింది !!

ఇంట్లో ఈగల చూసింది
ఇ ఈలు రాసింది !!

ఉడుతా ఊయల చూసింది 
ఉ ఊలు రాసింది !!

ఋషి రూమును చూసింది
ఋ ౠలు రాసింది //

ఎలుక ఏనుగు ను చూసింది
ఎ ఏ ఐలు రాసింది !!

ఒంటెను ఓడను చూసింది
ఒ ఓ ఔలు రాసింది !!

అందరి పిల్లలను చూసింది
అం ఆః లను రాసింది !!

అచ్చులు హల్లులు నేర్చింది
అక్షర మాల కట్టింది !!
అమ్మ మెడలో వేసింది


కామెంట్‌లు