ఆత్మ విశ్వాసపు రెక్కలు.. : -మొహమ్మద్ .అఫ్సర వలీషా -ద్వారపూడి (తూ గో జి ).
నిశీధిలో కూడా నిర్లిప్తత
 కానరాని నిస్తేజ ఉత్తేజ
 నయనాలు వారివి....
నవ చైతన్య సుమాలు
విరబూస్తున్న ఆత్మవిశ్వాసపు
 రెక్కలు వారివి.....
నిర్భయత్వానికి 
అభయ మిస్తున్న రక్షణ 
హస్తాలు వారివి ...
నిరంతరం నవ్యత్వానికి 
నాంది పునాది మేమనే
కరములు వారివి...
నిస్వార్థ పరులు
 నిగర్వులు,నిరాడంబరులు,
 నవనీత హృదయాలు వారివి...
నిరాశావాదాన్ని  వదలి
నిత్య శోధనకు బాటలు వేసె
 ఆసనాలు వారివి......
నిత్య వసంతాలు వారి
జీవితంలో పూయాలనే
 తలపుల నావలు వారివి...
నవతరానికి ఆదర్శులు
కావాలనే తపనల 
చేవలు వారివి....
నేటి తరానికి నిలువెత్తు
ఆదర్శం వీరి ఆత్మ విశ్వాసపు
చిత్ర దర్శనం...!!


కామెంట్‌లు