మధువొలికే జున్ను:: -- లీలా కృష్ణ.-తెనాలి
మధురముతో జత కూడిన చుక్క...
మిరియాలను ముద్దాడిన ముక్క .

పంటి క్రింద చేరదు ఏ ప్రక్క..
నాలుక మీద జాలువారును ఎంచక్క .

మితముగా తిన్నచో తప్పు లేదన్నది మా అక్క .
అతిగా ఆరగించిన ఎడల.. తీర్చుతుంది మన తిక్క .

 ప్రపంచానికి సుపరిచితమే కదా నే వర్ణించిన ఈ జున్నుముక్క.


కామెంట్‌లు